Mehul Choksi: మెహుల్ చోక్సీ కేసు విచారణ వాయిదా
Mehul Choksi: పీఎన్ బీ కుంభకోణంకేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణ 11వ తేదీకి వాయిదా పడింది.
Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, కిడ్నాప్ డ్రామా కొద్దిరోజులుగా హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించారన్న ఆరోపణలపై ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన డొమినికాలోని స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చోక్సీ న్యాయవాదుల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు వినిపించింది. ఈ క్రమంలో డొమినికా ప్రభుత్వం తరఫున న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని, ఇంకా విచారించాల్సి ఉందని వాదించారు. ఈ మేరకు హైకోర్టు విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.
దీంతో మెహుల్ చోక్సీ బృందం దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్‌పై సైతం విచారణ వాయిదా పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీ 2018లో అంటిగ్వా పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న చోక్సీ.. గత నెల మే 23న అదృశ్యమయ్యారు. అనంతరం డొమినికా ద్వీపంలో అనుమానాస్పదంగా కనిపించగా.. పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అంటిగ్వాలోని జాలీ హార్బర్ నుంచి తనను కిడ్నాప్ చేసి పడవలో డొమినికాకు తీసుకువచ్చారని ఆయన న్యాయవాదులు ఆరోపించారు. హేబియస్ కార్పస్ పిటిషన్ వాదలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు చోక్సీని రోజౌ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టగా బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు బార్బరా జరాబికా. ఆమె ఎవరో కాదు మెహుల్ చోక్సీ స్నేహితురాలు. అయితే ఈ కేసులో తరుచూ తన పేరు వినిపిస్తుండటంతో అసహనం చెందిన బార్బరా..
చోక్సీని ఓ స్నేహితుడిగానే భావించానని.. కానీ ఆయన మాత్రం తన దగ్గర నుంచి వేరే ఆశించేవాడని బార్బరా తెలిపింది. అందువల్లే తన విమాన టిక్కెట్ల ఖర్చులు భరించడంతో పాటు హోటల్లో రూమ్ బుక్ చేసేవాడని తెలిపింది. తాను చోక్సీతో కలిసి చాలాసార్లు కాఫీ, డిన్నర్, వాకింగ్‌కు వెళ్లానని చెప్పుకొచ్చింది. చోక్సీ తరుచూ తన అపార్ట్‌మెంట్‌కి వచ్చేవాడని, తాను అతడితో కేవలం స్నేహం, బిజినెస్ మాత్రమే భావించేదానినని, అతడు మాత్రం అంతకు మించి ఆశించేవాడని చెప్పుకొచ్చింది. తన ప్రవర్తనను చోక్సీ తప్పుగా అర్ధం చేసుకున్నాడని పేర్కొంది.