Lunar Eclipse: 600 ఏళ్ల తర్వాత అద్భుతం.. నేడే అరుదైన చంద్రగ్రహణం..
Lunar Eclipse: గడిచిన 580 ఏళ్ల తర్వాత నేడు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.
Lunar Eclipse: గడిచిన 580 ఏళ్ల తర్వాత నేడు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం దాదాపు మూడు గంటలు కొనసాగుతుందని ఖగోళ నిపుణులు తెలిపారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 17 నిమిషాలకు ముగుస్తుందని స్పష్టం చేశారు. గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని ఇది 580 ఏళ్లలో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం అవుతుందని వెల్లడించారు.
ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలో కనిపించనుంది. అలాగే భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పరిణామానికి ముందు, తర్వాత జరిగే పెనంబ్రల్ గ్రహణం యూపీ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు.