Israel: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం
Israel: నెతన్యాహు ఆదేశాలను అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం
Israel: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. గాజాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదులను వేటాడి హతమార్చాలని గూఢచారి సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. నెతన్యాహు ఆదేశాలను అమలు చేయడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
టర్కీ, లెబనాన్, ఖతార్‌లలో హమాస్ నాయకులను వేటాడేందుకు ఇజ్రాయెల్ గూఢచారి ఏజెన్సీలు ఇప్పటికే నిఘా పెట్టాయి. హమాస్ వర్గానికి ఖతార్ సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. రాజధాని దోహాలో హమాస్ కార్యకలాపాలను దశాబ్దంపాటు కొనసాగించేందుకు అనుమతిని కూడా ఇచ్చింది. ఖతార్ తో పాటు ఇరాన్, రష్యా, టర్కీ, లెబనాన్,లు కూడా హమాస్ కార్యకలాపాలకు అవకాశం కల్పించాయని యుఎస్ ఇప్పటికే ఏన్నోసార్లు ఆరోపించింది. ఆయా దేశాలతో దౌత్యపరమైన సంక్షోభాలను తొలగించడానికి ఇజ్రాయెల్ కూడా ఇన్నాళ్లు హమాస్‌ను ఇతర దేశాల్లో లక్ష్యంగా చేయలేదు. కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్‌ను ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ ప్రస్తుతం సిద్ధమైనట్లు తెలుస్తోంది.