ఖమేనీ వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి

Ali Khamenei: భారత్ లోని ముస్లింలు కూడా బాధపడుతున్నారని ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ సుసేనీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రెవెనూ అజర్ తప్పుబట్టారు.

Update: 2024-09-18 06:43 GMT

ఖమేనీ వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి

Ali Khamenei: భారత్ లోని ముస్లింలు కూడా బాధపడుతున్నారని ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ సుసేనీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రెవెనూ అజర్ తప్పుబట్టారు. మీరు మీస్వంత ప్రజలను అణచివేసేవారని ఖమేనీపై ఆయన విమర్శలు చేశారు. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల్లో ముస్లింలు ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు. ఇరాన్ ప్రజలు త్వరలోనే స్వేఛ్చను పొందుతారని ఆయన చెప్పారు.

ఎక్స్ లో ఖమేనీ చేసిన ట్వీట్ పై భారత్ తీవ్రంగానే స్పందించింది. ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని భారత్ తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల కాలంలో శత్రుత్వం పెరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలుగు చూశాయి. ఈ రెండు దేశాల మధ్య వైరం భారత ప్రభుత్వాన్ని అసౌకర్యానికి గురి చేస్తోంది.

Also Read: Iran Supreme Leader Khamenei: భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారన్న ఖమేనీ... తీవ్రంగా స్పందించిన భారత్

Tags:    

Similar News