World Press Photo:కరోనాపై గెలిచిన వృద్ధురాలు; వరల్డ్ ప్రెస్ ఫొటోగా ఎంపిక
World Press Photo: ఆ స్పర్శలోని ప్రేమ 5 నెలల నరకాన్ని మరిపించింది. ఆ నర్సు చూపిన అభిమానం 80 ఏళ్ల భామ్మను పసిపాపలా మార్చింది.
World Press Photo: ఆ స్పర్శలోని ప్రేమ.. ఐదు నెలల నరకాన్ని మరిపించింది. ఆ నర్సు చూపిన అభిమానం 80 ఏళ్ల ముసలమ్మను పసిపాపను చేసింది. మహమ్మారితో పోరులో గెలిచి నిలిచిన ఆవృద్ధురాలని స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రేమగా సాగనంపుతున్న క్షణంలో నర్సు భావోద్వోగం.. 2020 ఆగస్టు 5న బ్రెజిల్‌లో తీసిన ఈ ఫొటో.., "వరల్డ్ ప్రెస్ ఫొటోగా" ఎంపికై 50లక్షల రూపాయలు గెలుచుకుంది.
కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్ర స్థాయిలో కృష్టి చేస్తు్న్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కాపాడడమే కాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తు్న్నారు. చెప్పాలంటే వారి సేవలు వెలకట్టలేనివి. కరోనా అంటేనే ప్రతి ఒక్కరు వణికిపోయే పరిస్థితి ఉన్న సమయంలో వారు అందించే ధైర్యం ఎనలేనిది.