స్పెయిన్‌లో ఇంకా విజృంభిస్తున్న కరోనా..

స్పెయిన్‌లో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన 24 గంటల్లో 687 మంది మరణించారు.

Update: 2020-04-18 09:56 GMT

స్పెయిన్‌లో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన 24 గంటల్లో 687 మంది మరణించారు.దీంతో ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 20 వేలు దాటింది. అమెరికా తరువాత, ఇక్కడ లక్షా 90 వేల 839 సంక్రమణ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 74 వేల 797 మందికి నయమైంది.

ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ను స్పానిష్ ప్రభుత్వం సడలిస్తోంది. దీనికి కారణం క్రమంగా వైరస్ సంక్రమణ తగ్గుముఖం పట్టడమే అని తెలుస్తోంది. వైరస్ సంఖ్యలు రోజు రోజుకు తగ్గుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. స్పానిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దానికంటే ఎక్కువ మంది కరోనావైరస్ తో చనిపోతున్నారు అని కొంతమంది అంటున్నారు.


Tags:    

Similar News