Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.. లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్..
Aruna Miller: అమెరికాలో తెలుగు అమ్మాయి చరిత్ర సృష్టించింది.
Aruna Miller: అమెరికాలో తెలుగు అమ్మాయి చరిత్ర సృష్టించింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ గవర్నర్ పదవి కోసం డెమోక్రటిక్ నాయకుడు వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ స్థానానికి అరుణా మిల్లర్ పోటీ చేసి విజయం సాధించారు.
గవర్నర్ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. మేరీలాండ్‌లో అరుణకు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. రిపబ్లిక్ మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా పని చేసినట్లు తెలుస్తోంది. మేరీ లాండ్‌లో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విస్తృతంగా ప్రచారం చేశారు. 58ఏళ్ల అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఆమె కుటుంబం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడింది.