Apple: యువతి ఫొటోలు లీక్.. రూ.36 కోట్ల పరిహారం చెల్లించుకున్న యాపిల్ సంస్థ
Apple: ఒరేగావ్ యూనివర్శిటీలో చదువుతున్న యువతి * ఐఫోన్ రిపేరుకిస్తే అందులో ప్రైవేట్ ఫొటోలు లీక్
Apple: ఫోన్ వాడుతున్నారా? అందులో ప్రైవేట్ ఫొటోలు ఉన్నాయా అయితే వెంటనే డిలీట్ చేయండి. లేదంటే మీకు తెలియకుండానే మీ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు ముందే జాగ్రత్త పడితే మనం కొద్దిగా సేఫ్టిలో ఉన్నట్టే.. ఎంతో సెక్యురిటీగా భావించిన ఐఫోన్ నుంచి యువతి ప్రైవేట్ ఫొటోలు లీక్ అయ్యాయి. దాంతో బాధితురాలికి యాపిల్ సంస్థ క్షమాపణలు చెప్పి 36 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించింది.
అమెరికాలోని ఒరేగావ్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థిని ఐఫోన్ పాడైపోవడంతో 2016లో పెగట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న ఐఫోన్ సర్వీస్ సెంటర్‌లో మరమ్మత్తు కోసం ఇచ్చింది. ఫోన్‌ను మరమ్మత్తు చేసిన అక్కడి టెక్నిషియన్లు అందులో ఉన్న యువతి నగ్న ఫొటోలు, వీడియోలు చూసి వాటిని తస్కరించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూసిన యువతి స్నేహితులు విషయాన్ని ఆమెకు చేరవేడయంతో దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత యువతి కోర్టుకెక్కింది. పరిహారంగా 5 మిలియన్ డాలర్లు అక్షరాల 36 కోట్ల రూపాయాలు నష్టపరిహారం చెల్లించింది. ఈ విషయాలు రహస్యంగా ఉంచారు. కానీ టెలిగ్రాఫ్ బహిర్గతం చేసింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు టెక్నిషియల్స్‌ను యాపిల్ సంస్థ సస్పెన్షన్ చేసింది.