America News: ఎయిర్‌పోర్టులో హింస.. అమెరికాలో భారతీయులకు తప్పని తిప్పలు!

America News: అమెరికా దృష్టిలో రిస్క్ జోన్‌కు దగ్గరగా ఉన్న దేశం కావడంతో ముందు జాగ్రత్తగా చెకింగ్‌లు చేస్తున్నారు.

Update: 2025-03-25 14:27 GMT
America News

America News: ఎయిర్‌పోర్టులో హింస.. అమెరికాలో భారతీయులకు తప్పని తిప్పలు!

  • whatsapp icon

America News: అమెరికాలో ఉన్న భారతీయులకు మరో పెద్ద షాక్ ఇది...! ట్రంప్‌ పాలనలో అమెరికాలో ఉండడమే నరకంగా మారుతున్న సమయంలో అక్కడ ఉంటున్న వారి బాధలు రెట్టింపు చేసేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. అమెరికా విమానాశ్రయాల్లో చెకింగ్‌ పేరుతో భారతీయుల ఎదుర్కొంటున్న బాధలు అన్నీఇన్నీ కావు. ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇతర దేశస్థులను హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. చెక్‌ఇన్ కౌంటర్ల దగ్గరే కొన్ని గంటల పాటు నిలిపివేస్తున్నారు. పాస్‌పోర్ట్, వీసా, జాబ్‌ రిలెటెడ్‌ డాక్యుమెంట్లను పూసగుచ్చినట్టు పరీశిలిస్తున్నారు.

అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వచ్చిన హెచ్‌1బీ వీసాదారులు, చదువుకోడానికి వచ్చిన F-1 వీసా విద్యార్థులు, పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్లు కూడా ఈ చెకింగ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా ఇప్పటివరకు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా ఉన్న భారతీయులు ఇప్పుడు అమెరికాకు రిటర్న్‌ వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా రీ-ఇష్యూ చేసే ప్రక్రియలో డిలే జరుగుతోంది. అనవసర అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ కారణంగా నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? ఉన్నట్టుండి ఇండియన్స్‌ను ఇంతలా ఎందుకు తనిఖీ చేస్తున్నారు? దానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది.

ట్రంప్ ప్రభుత్వం ఇటీవల 43 దేశాలపై ప్రయాణ నిషేధాన్ని ప్రతిపాదించింది. అంటే.. ఆ దేశాల ప్రజలు అమెరికాలోకి రాకూడదని అర్థం. ఆ జాబితాలో ఇండియా లేదు. భారతీయులపై నేరుగా ఎలాంటి నిషేధం పెట్టలేదు. కానీ ట్రంప్‌ బ్యాన్‌ చేయాలనుకుంటున్న లిస్ట్‌లలో ఇండియా పొరుగుదేశాలైన పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, భూటాన్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కారణంగా భారతీయులపైనా అమెరికా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయులను కూడా రిస్క్ కేటగిరీలోనే ఉన్నట్టు అనాధికారికంగా చూస్తున్నారు. నిజానికి అమెరికాలో ఉండే చాలా మంది భారతీయులు చట్టబద్ధంగానే ఉంటున్నారు. పన్నులు చెల్లిస్తున్నారు. విద్య, ఉద్యోగం కోసం అక్కడికి వళ్తున్నారు. అయినా కూడా భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికా దృష్టిలో రిస్క్ జోన్‌కు దగ్గరగా ఉన్న దేశం కావడంతో ముందు జాగ్రత్తగా చెకింగ్‌లు చేస్తున్నారు.

Tags:    

Similar News