
Myanmar Earthquake: బ్రేకింగ్ న్యూస్.. మయన్మార్‌లో మరోసారి భూకంపం
Myanmar Earthquake News today: బ్రేకింగ్ న్యూస్.. మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మయన్మార్‌లో దేశ రాజధాని తరువాత రెండో అతిపెద్ద నగరమైన మండాలయ్ సమీపంలో మరోసారి భూమి కంపించింది. ఈసారి భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. అమెరికా జియాలాజికల్ సర్వే విభాగం ఈ వివరాలను వెల్లడించింది. మండాలయ్ నగరంలో జనం ఇళ్లు, భవనాలు విడిచి వీధుల్లోకి పరుగెత్తారు.
ఇప్పటికే శుక్రవారం నాటి భూకంపం మయన్మార్‌లో భారీ మొత్తంలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మయన్మార్ దేశానికి పొరుగునే ఉన్న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోనూ ఈ భూకంపం పెను విషాదానికి కారణమైంది. నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం భూకంపం ధాటికి కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో 40 మందికిపైనే శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. భవనం శిథిలాలు గుట్ట తరహాలో ఒక్కచోట పేరురుపోవడంతో రెస్క్యూ టీమ్స్ సహాయ చర్యలు చేయడం కూడా చాలా కష్టంగా మారింది.
మయన్మార్‌లో 1600 దాటిన మృతుల సంఖ్య
మయన్మార్‌లో శుక్రవారం నాడు మధ్యాహ్నం భూకంపం సృష్టించిన విధ్వంసం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1600 దాటింది. మరో 3400 మంది ఆచూకీ లేదు. అక్కడి పరిస్థితి చూస్తోంటే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని మయన్మార్ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
భారీ సంఖ్యలో భవనాలు నేలకొరిగాయి. అనేక ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, వంతెనలు వంటి మౌళిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైలు, విమానాల సేవలు నిలిపేశారు.
ఈ బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్ అవుతోంది.