Gaza:గాజాలో వైమానిక దాడి..ఒకే కుటుంబంలో 18 మంది దుర్మరణం
Gaza:గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దుర్మరణం చెందారు.
Gaza:కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య చర్యలు అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో గాజాపై మరోసారి భీకర దాడులు జరిగాయి. జవైదా పట్టణంలో టెల్ అవీవ్ జరిపిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు. అల్ అక్సా హాస్పటల్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ దాడిలో వ్యాపారి సమీ జవాద్ అల్ ఎజ్లా, అతని ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధరలు మరణించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
లెబనాన్ లోని నాబాతీహ్ ప్రావిన్స్ లో జరిపిన దాడిలో ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలతోపాటు 10 మంది మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హెజ్ బొల్లాకుచెందిన ఆయుధ నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తీర ప్రాంత టైర్ నగరంలో జరిపిన దాడిలో ఓ హెజ్ బొల్లా కమాండర్ ను హతమార్చినట్లు వెల్లడించారు. అతని వివరాలు ఇంకా వెల్లడికాలేదు. సెంట్రల్ గాజాలోని మాఘాజీ శరణార్థి శిబిరం, పరిసర ప్రాంతాల్లోని పాలస్తీయన్లు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.