ఒకప్పుడు నక్సలిజం రాజ్యమేలితే... ఇప్పుడు దేశ భక్తితో ఆ గ్రామం ఊగిపోతుంది

Army Village: సైనికులను అందిస్తున్న సిద్దిపేట జిల్లా కట్కూర్

Update: 2023-08-15 02:45 GMT

ఒకప్పుడు నక్సలిజం రాజ్యమేలితే... ఇప్పుడు దేశ భక్తితో ఆ గ్రామం ఊగిపోతుంది

Army Village: ఒకప్పుడు నక్సలిజం రాజ్యమేలితే... ఇప్పుడు దేశ భక్తితో ఆ గ్రామం ఊగిపోతుంది.. ఈ గ్రామానికి చెందిన యువత. దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ సరి హద్దుల్లో పహారా కాస్తూ దేశ భక్తిని పెపొందించుకుని సేవ చేస్తున్నారు. తెలంగాణలో ఆగ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఒకప్పుడు స్థానిక ప్రజల కోసం తుపాకులు పట్టిన యువకులు ఇప్పుడు దేశం కోసం తుపాకులు పట్టారు.. అయితే అప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకులను మోగిస్తే.. తాజాగా ఇప్పుడు దేశానికి శత్రువులుగా ఉన్న మూకలపై తుపాకులు పేల్చుతున్నారు. ఇలా ఆ గ్రామం నక్సలిజం నుండి దేశభక్తి వైపు ఓ గ్రామం మళ్లింది. అ గ్రామమే సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలం కట్కూర్ గ్రామం. ఈ గ్రామంలో సుమారు వందకు పైగా యువత సైనికులలో చేరి దేశం సరిహద్దులలో పహారా కాస్తూ దేశ సేవ చేస్తున్నారు. దేశ సేవలో శత్రువుల చేతిలో గ్రామానికి చెందిన కొందరు తమ ప్రాణాలను సైతం వదిలారు. దీంతో ఆ గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.

కట్కూర్ గ్రామం అంటే ఒకపుడు ప్రజలకు భయం వేసేది. పిపుల్స్ వార్ ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియని పరిస్థితి. ఆలాంటి గ్రామం ఇప్పుడు పూర్తిగా మారి పోయింది. దేశసరిహద్దుల్లో వందకు పైగా యువకులు మిలిటరీలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లుగా విధులు నిర్వహించడంతో కట్కూర్ గ్రామం రాష్ట్రంలోనే సైనికులను అందించిన ఆదర్శగ్రామంగా నిలిచింది.

సిద్దిపేట జిల్లా అక్కనపేట్ మండలం కట్కూర్ గ్రామంలోచాలామంది ఉగ్రవాదుల దాడులలో వీరమరణం పొందిన వారే.. యువత పట్టు వదలకుండా ఎంతోమంది చనిపోయిన తర్వాత 25 మంది ఆర్మీ లో చేరి దేశభక్తితో పాటు ఆ కట్కూర్ గ్రామనికి ధైర్యాన్ని తెచ్చారు. ప్రస్తుతం 130 మంది యువత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా కట్కూర్ గ్రామంలో 40 సంవత్సరాల క్రితం జేర్రి పోతుల డేనియల్ ఆర్మీ లో జవానుగా చేరాడు. ఆయన స్పూర్తితో ఎంతో మంది యువకులు దేశరక్షణలో భాగస్వామ్యులవుతున్నారు.

మొదట గ్రామనికి చెందిన గిరిజన యువకుడు నరసింహ నాయక్ మిలటరీ లో జవానుగా పనిచేస్తూ తీవ్రవాదుల జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందాడు. చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో 2014లో తీవ్రవాదులకు సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నరసింహ నాయక్ మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత గ్రామంలో తీవ్ర విషాదం అలుముకున్న ఆ గ్రామం యువత మనోధైర్యాన్ని మాత్రం వీడలేదు. వారి మరణనంతరం కూడా గ్రామానికి చెందిన యువకులు పట్టువదలకుండా ఆర్మీ లో చేరుతున్నారు.

ఈ గ్రామానికి చెందిన సైనికులు 40 నుంచి 50 మంది జవాన్లు దసరాకు నెలరోజుల సెలవుపై వచ్చి సంవత్సరంలో ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ యువతకు సలహాలు సూచనలు ఇస్తారు. దీంతో మిగిలిన యువత సైతం ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆ గ్రామంలోని వందలాది మంది వెళుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

1. కట్కూరి సర్పంచ్

2. వర్ష శ్రీనివాస్

3. భూపతి లింగారెడ్డి ఆర్మీ తండ్రి

4. కలకుంట్ల విక్రం ఆర్మీ

Tags:    

Similar News