Asifabad: తెలంగాణ‌లోనే మొట్టమొద‌టి సారి జాతీయజెండా ఎగుర‌వేసిన గ్రామం

Asifabad: జాతీయ జెండా ఎగరేసి చరిత్ర పుటల్లోకి ఎక్కిన బాబ్రీ గ్రామం

Update: 2023-08-15 05:00 GMT

Asifabad: తెలంగాణ‌లోనే మొట్టమొద‌టి సారి జాతీయజెండా ఎగుర‌వేసిన గ్రామం

Asifabad: దేశంలో బ్రిటీషు పాలన అంతమొందించేందుకు అక్కడి యువ‌కులు ముందడుగు వేశారు. స్వాతంత్ర్య ఉద్యమం పోరాటంలో ఈ గ్రామ యువకులు చురుకుగా పాల్గొన్నారు. పోరాటాల్లో అప్పటి బ్రిటిష్‌ సైనికుల లాఠీ, తూటాలు కూడా తిన్నారు. దేశానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే రోజు రానే వ‌చ్చింది. పోలీస్ స్టేష‌న్‌లో సెట్ల ద్వారా విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు అర్ధరాత్రే జెండా ఎగుర‌వేశారు. తెలంగాణ‌లోనే మొట్టమొద‌టి సారి జాతీయ జెండా ఎగుర‌వేసిన గ్రామంగా చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోయింది.

ఆసిఫాబాద్‌ జిల్లా ద‌హెగాం మండ‌లంలోని బీబ్రా గ్రామం చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి పొందింది. నైజాం నవాబుల పాలనలో కాగజ్‌నగర్ ప్రాంతంలో అదే పెద్ద గ్రామం. అప్పటి నవాబులు 100 గ్రామాలకు బీబ్రాలో పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ పరిసర ప్రాంతాలు ప్రజలకు నిజాం కాలపు పెద్ద గ్రామంగా బీబ్రా ఉండేది. మహారాష్ట్రను కేంద్రంగా చేసుకొని పాలన సాగించిన నిజాం రాజులు బిబ్రా కేంద్రంగా పాలన కొనసాగించారు. కాగజ్‌నగర్‌,బెజ్జూరు, దహేగాం, భీమి ని తాండూరు తదితర మండలాల్లోని 100 గ్రామాలకు ఈ గ్రామంలోని పోలీస్ ఠాణా ఉండేదంటే దాని ప్రాముఖ్యత తెలుస్తోంది. ఒక అమీన్ సాబ్, తోపాటు మరో 12 మంది సిబ్బంది ఇక్కడ ఉండేవారు.

స్వాతంత్య్ర స‌మ‌రంలో ఇక్కడ యువ‌కులు చురుకుగా పాల్గొనేవారు. బ్రిటీషు వారిని వ్యతిరేకించి, వారికి ఎదురొడ్డి నిలిచారు. బ్రిటిషుపాలన ముగిసి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున పోలీస్ స్టేషను సెట్ ద్వారా స్వాతంత్య్రం వచ్చినట్లు తెలవడంతో గ్రామ‌స్తుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఆ గ్రామానికి చెందిన షావుకారి తన ఇంటి ముందు కూడలిలో బండలతో జెండా గద్దెను కట్టి అర్ధరాత్రి జెండా ఎగురవేశారు. తెలంగాణలోనే తొలి జాతీయ జెండా ఎగరేసిన గ్రామంగా బాబ్రీ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.. అప్పటి నుండి ఇప్పటివరకు అదే చోట జెండా ఎగురవేస్తున్నారు. అప్పటి షావుకారి కుటుంబీకులే వారసత్వంగా జెండా ఎగురవేస్తుండడం గమనార్హం..

Tags:    

Similar News