Kuchoor: దేశరక్షణలో భాగస్వాములవుతున్న గ్రామస్తులు.. ఒక్కో ఇంటి నుంచి ఒక్కరు.. ఆర్మీలో సేవ చేస్తున్న యువకులు
Kuchoor: ఆర్మీలో చేరిన యువత తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం
Kuchoor: దేశరక్షణలో గ్రామీణ యువత ఎక్కువగా భాగస్వాములు అవుతున్నారు. మహబూబ్‍నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని యువకులు ఉద్యోగం కోసం వేరే ప్రయత్నాలు చేయరు.. వారంతా దేశరక్షణలో భాగస్వాములు కావడానికి సిద్ధమవుతారు... అందుకోసం ఆర్మీనే ఎంచుకుంటారు.. ఆర్మీలో చేరిపోతారు. ఇలా 80 మంది యువకులు ప్రస్తుతం ఆర్మీలో కొనసాగుతున్నారు. దీంతో ఆ గ్రామం ఆర్మీ సైనికుల గ్రామంగా పేరొందింది. ఇంతకీ ఏదా గ్రామం..? ఆ గ్రామ యువత అంతలా... దేశ రక్షణలో భాగస్వాములు కావడానికి కారణమేంటి...?
ఇది మహబూబ్‍నగర్ జిల్లా నవాబుపేట మండలం కూచూరు గ్రామం. ఈ గ్రామం అంటేనే దేశరక్షణలో భాగమైన ఆర్మీ సైనికులకు నిలయం. ప్రస్తుతం ఆర్మీలో 80 మంది కొనసాగుతుండగా... 20 మంది వరకు రిటైర్ అయ్యారు. వ్యవసాయం తప్ప... మరే ఆదాయం లేకపోవడంతో కూచూరు గ్రామ యువత చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని ఆశిస్తుంటారు. దీంతో గ్రామంలోని 90 శాతం యువత ఆర్మీలో చేరుతున్నారు. ఓ ఒంట్లో శ్రీనివాస్ సహా ఇద్దరు అన్నదమ్ములు రామస్వామి, లక్ష్మణ్ సైతం ఆర్మీలోనే చేరారు. ముగ్గురు అన్మదమ్ములము ఆరు నెలలకోసారి ఇంటికి వస్తామని, నెలరోజుల పాటు కుటుంబంతో గడిపి... తిరిగి మళ్లీ విధుల్లోకి వెళతామని చెపుతున్నారు సెలవుపై ఇంటికి వచ్చిన శ్రీనివాస్.
అయితే ఇంట్లో ఒక్కరు ఉన్నా.. ఇద్దరు, ముగ్గురున్నా... వారంతా ఆర్మీలో చేరిపోవాల్సిందే.... గ్రామానికి చెందిన జయమ్మకు ముగ్గురు ఆడపిల్లలు.. ఒకే కుమారుడు శివకుమార్ గౌడ్ ఉన్నాడు. ఒక్కడే కొడుకని ఆలోచించకుండా ఆర్మీలో చేర్పించింది. ప్రస్తుతం శివకుమార్ గౌడ్ సెలవుపై గ్రామానికి వచ్చాడు. ఆర్మీలో చేరి 14 సంవత్సరాలు కావస్తుండంతో... మరికొన్ని సంవత్సరాల్లోనే కాలపరిమితి పూర్తి చేసుకుని గ్రామానికి వచ్చి స్థిపరడతానని శివకుమార్ చెబుతున్నాడు.
ఈ గ్రామంలో 80 మంది ఆర్మీలో చేరి దేశసేవ చేస్తున్నారు. గ్రామంలోని ప్రతీ యువకుడు దేశ సేవలోనే భాగస్వామి కావాలని భావిస్తుంటారు. గ్రామంలో ఆర్మీలో చేరిన సీనియర్లేను స్పూర్తిగా తీసుకుని మిగతా వారు కూడా ఆర్మీలో చేరిపోతుంటారు. గ్రామంలోని 90 శాతం మంది యువత దేశ రక్షణలోనే కొనసాగుతున్న కారణంగా... సాధారణ రోజుల్లో ఈ గ్రామం బోసిపోయి కనిపిస్తుంది. ప్రతీ ఆరు నెలలకోసారి ఆర్మీ సైనికులు నెలరోజులు సెలవు పెట్టి గ్రామానికి చేరుకోవడంతో ఆ నెలరోజుల పాటు గ్రామంలో పండగ వాతావరణం కనిపిస్తుంది.
కూచూర్ గ్రామంలోని యువత దేశం కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. వారి వారి తల్లిదండ్రులు, భార్యా పిల్లల ప్రోత్సాహం కూడా ఉండటంతో ఆర్మీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లో పెద్దదిక్కుగా ఉండాల్సిన వారు ఆర్మీలో చేరిపోతుండంతో... వారి కుటుంబ సభ్యుల భాధలు వర్ణాతీతం. సైనికుడు కృష్ణారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న వనజ బాధను ఆమె మాట్లల్లోనే విందాం.
అయితే కూచూర్ గ్రామం పేరు కాస్త... ఆర్మీ గ్రామంగా పేరు గాంచింది. దీంతో దేశరక్షణలో భాగమైన తమ గ్రామ యువతను చూసి గ్రామస్తులు గర్వపడుతుంటారు. ఈ గ్రామ యువత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుండడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందంటున్నారు గ్రామస్తులు.
కుటుంబ పోషణే కాకుండా దేశంపై ఉన్న భక్తితోనూ కూచూర్ గ్రామ యువకులు ఆర్మీలో చేరుతున్నారు. ప్రతి ఏడాది ఈ గ్రామం నుంచి నలుగురైదుగురు ఆర్మీలో చేరడాన్ని చూస్తుంటే... వారికి దేశంపై ఉన్న అభిమానం ఏంటో స్పష్టమవుతోంది.