Natu Kolla Pempakam: నాటు కోళ్ల పెంపకంలో యువరైతు ఆర్ధిక పురోగతి

Natu Kolla Pempakam: ఎవుసం ఎల్లకాలం ఒకేలా వుండదు. ఎత్తు పల్లాలను, లాభ నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.

Update: 2021-08-04 09:02 GMT

Natu Kolla Pempakam: నాటు కోళ్ల పెంపకంలో యువరైతు ఆర్ధిక పురోగతి

Natu Kolla Pempakam: ఎవుసం ఎల్లకాలం ఒకేలా వుండదు. ఎత్తు పల్లాలను, లాభ నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాలు రైతులకు బాసటగా నిలుస్తాయి. సాగు రంగంలోకి రావాలనుకునే యువతకూ అనుబంధ రంగాలైన కోళ్లు, జీవాలు, కుందేళ్లు, కౌజు పిట్టల పెంపకం వంటివి ఆసరాగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశీ కోళ్లు పెంపకంపై ఆసక్తి చూపుతున్న యువత సంఖ్య పెరుగుతుంది. అదే కోవలో రెండేళ్లుగా అసిల్ జాతి కోళ్ల పెంపకంలో లాభాల బాటలో ముందుకు సాగుతున్నాడు యువ రైతు రంగా నాయక్.

రంగారెడ్డి జిల్లా బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన రంగానాయక్ రెండేళ్లుగా దేశీ కోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాడు. డిగ్రీ వరకు చదివిన ఈ యువరైతు కష్టే ఫలి అన్న సూత్రాన్ని మరువకుండా అసిల్ జాతి కోళ్ల పెంపకంలో క్రమక్రమంగా లాభాల బాటలో పయనిస్తూ ఉన్నాడు. గ్రామాల్లో కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. ఇళ్లు, వ్యవసాయ పొలాల్లో నాటు కోళ్లు పెంచడం అనాదిగా వస్తోంది. అయితే వాణిజ్య సరళిలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే యువ రైతు దేశీ కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు గడిస్తున్నాడు.

ప్రస్తుత కాలంలో పౌష్టికాహారానికి ప్రధాన్యత పెరిగింది. ఆహారంలో మాంసం వినియోగం కూడా ఎక్కవ మొత్తంలో పెరుగుతున్న నేపథ్యంలో నాటు కోళ్ళకు ఉన్న డిమాండ్ గుర్తించిన ఈ యువ రైతు సుమారు 2 వేల అసిల్ జాతి కోడి పిల్లలతో పెంపకం ప్రారంభించి ముందుకు సాగుతున్నాడు. దేశీ కోళ్ల పెంపకంలో కోడి పిల్లల దగ్గర్నుండి కంటికి రెప్పగా కాపాడుకోవాలని, వాటికి నీరు, దాణా, షెడ్ల నిర్వాహణ విషయంలో కాలానుగుణ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషణ ఇవ్వగలిగితే, మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చని అంటున్నాడు యువరైతు రంగానాయక్.

ఈ కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేతికొచ్చిన దిగుబడిని మార్కెట్ లో ఏ విధంగా అమ్ముకోవాలి ? నాటు కోళ్లకున్న డిమాండ్ ని బట్టి ఆదాయం ఎంత మొత్తంలో వస్తుంది ? లాభదాయకంగా మార్యెటింగ్ చేసుకునే మెళకువలు యువరైతు మాటల్లోనే తెలుసుకుందాం. 

Full View


Tags:    

Similar News