LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో పెట్టుబడి పెట్టడం లాభమా.. నష్టమా..!

LIC IPO: దేశంలో అతిపెద్ద ఐపీవో రాబోతోంది. ఇందులో పెట్టుబడిదారులకు 4 మే 2022 నుంచి 9 మే 2022 వరకు సమయం ఉంటుంది.

Update: 2022-04-30 13:20 GMT

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో పెట్టుబడి పెట్టడం లాభమా.. నష్టమా..!

LIC IPO: దేశంలో అతిపెద్ద ఐపీవో రాబోతోంది. ఇందులో పెట్టుబడిదారులకు 4 మే 2022 నుంచి 9 మే 2022 వరకు సమయం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే చాలామంది ప్రజలు ఎల్‌ఐసి షేర్లలో డబ్బు పెట్టుబడి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇది లాభమా, నష్టమా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంపై మార్కెట్ ఆర్థిక నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. కొందరు IPOలో షేర్ల ధర చాలా మంచి స్థాయిలో ఉందని వాదిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థలలో ఒకదానిలో వాటాను తీసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశమని చెబుతున్నారు. అంతేకాదు ఈ ఛాన్స్‌ అస్సలు మిస్‌ కాకూడదని అంటున్నారు.

IPOలో వాటాలను తీసుకునే బదులు పెట్టుబడిదారులు దాని షేర్లు జాబితా చేయబడే వరకు వేచి ఉండాలని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. లిస్టింగ్ తర్వాత కొంత సమయం వరకు దాని షేర్లు వ్యాపారాన్ని ఎలా చూపుతాయి అనే దానిపై ఒక కన్ను వేసి ఉంచిన తర్వాత మాత్రమే, షేర్లను కొనుగోలు చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలని చెబుతున్నారు.

LIC యొక్క IPO ప్రత్యేక విషయలు

ఈ ఐపీఓ ద్వారా కంపెనీలో 3.5 శాతం వాటాను విక్రయించాలని దీని ద్వారా రూ.20,557.23కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఐపీఓలో ఎల్‌ఐసీకి చెందిన 22.13కోట్ల షేర్లు జారీ అయ్యాయి. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రభుత్వం 22,13,74,920 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఎల్‌ఐసీ ఐపీవో మే 4న ఓపెన్‌ అవుతుంది. మే 9న ముగుస్తుంది. దీని కోసం కంపెనీ ఒక్కో షేరుకు రూ. 902 నుంచి 949 వరకు ధరను నిర్ణయించింది. ఈ ఐపీఓలో కంపెనీ ఉద్యోగులకు 15,81,249 కోట్ల షేర్లు, పాలసీదారులకు 2,21,37,492 కోట్ల షేర్లు రిజర్వ్ చేయబడ్డాయి.

Tags:    

Similar News