సంప్రదాయ పంటలను సాగు చేస్తూ, స్థిరమైన ఆదాయం లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు ఎంతో మంది రైతులు. ఈ నేపథ్యంలో వాణిజ్య పంటలతో కలప చెట్ల పెంపకం ప్రత్యామ్నాయంగా మారింది. ఎర్ర చందనం, శ్రీగంధం వంటి కలప జాతి చెట్ల పెంపకం తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో రైతులకు లాభాలు కురిపిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అగర్ వుడ్ సాగు వచ్చి చేరింది. దిగుబడికి ఎక్కువ సమయం తీసుకునే ఇవి మన వాతావరణంలో పెరుగుతాయో లేదో అనే సందేహంతో రైతులు సాగుకు ముందుకు రాలేదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఎక్కడైనా, ఎవరైనా సాగు చేయవచ్చని అంటున్నారు సూర్యపేట జిల్లాకు చెందిన వెంకట్ గౌడ్ విష్ణు అనే రైతులు. సేంద్రియ విధానంలో అగర్ వుడ్ తో పాటు, శ్రీగంధం సాగు చేస్తున్న వీరి వ్యవసాయ క్షేత్రంపై ప్రత్యేక కథనం.
సూర్యపేట జిల్లాకు చెందిన వెంకట్ గౌడ్, విష్ణు లు 20 ఎకరాల్లో అగర్ ఉడ్ చెట్లను సాగు చేస్తున్నారు, సాధారణంగా అగర్ ఉడ్ చెట్ల సాగు అనగానే, ఎవరికైనా వచ్చే సందేహం వాతావరణం. అయితే ఈ చెట్లు ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈశాన్య రాష్ర్టాలైన అసోం, త్రిపురలలో సాగు భారీగా ఉంటుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు వీటీ సాగుకు అనుకూలమేనా ? పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..