AP Government Jobs: ఏపీలో ఉద్యోగ జాతర.. వరస పెట్టి నోటిఫికేషన్లు రిలీజ్..
Government Jobs: ఏపీలో ఉద్యోగ జాతర మొదలైంది. వరస పెట్టి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి.
Government Jobs: ఏపీలో ఉద్యోగ జాతర మొదలైంది. వరస పెట్టి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు బ్యాక్ టు బ్యాక్ వచ్చేశాయి. తొలుత 897 పోస్టులతో గ్రూప్- 2 నోటిఫికేషన్ విడుదల కాగా.. మరుసటి రోజే 81 పోస్టులతో గ్రూప్- 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసి యువతకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి.. ఉద్యోగాల భర్తీలో తన చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే రెండు నోటిఫికేషన్లు ఇవ్వడం జగన్ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకుంటున్నారు వైసీపీ శ‌్రేణులు.
గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీచేయనున్నారు. అందులో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులు భర్తీ కానున్నాయి. అదే విధంగా 897 గ్రూప్ -2 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్క తీస్తే ఇప్పటిదాక 6లక్షల 16వేల 323పోస్టులను నియమించింది. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని ఉద్యోగాలు ఎపుడూ కల్పించిన దాఖలాలు లేవు. జగన్ సీఎం అయ్యాక కాంట్రాక్టు ఉద్యోగులపై ఉన్న నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం.
సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానికంగానే జాబ్స్ ఇచ్చి కొత్త చరిత్రను సృష్టించారు జగన్. దాని వల్ల పేద మధ్యతరగతి జీవితాలు బాగుపడ్డాయని చెప్పక తప్పదు. ప్రజారోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టులను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది. లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు. 3 లక్షల 99 వేల 791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది. 19 వేల 701 పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు జరిగాయి. ఇవి కాక మరో 10 వేల 143 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. యూనివర్శిటీల్లో 3500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఇవన్నీ ఏపీలో నిరుద్యోగ భూతాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో జగన్ సర్కార్ సాధించిన అద్భుత విజయంగానే చూడాలని అంటున్నారు వైసీపీ నేతలు. అలాగే విద్యకు జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. నాడు- నేడు కార్యక్రమం కింద గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఖర్చు చేయనన్ని నిధులు కేటాయించి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మేధావులు సైతం కొనియాడుతున్నారు.