ఉచిత విద్య నుంచి ఉపాధి వరకు.. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మొత్తం సమాచారం..!

MyScheme.gov.in: దేశంలో ఆర్థిక స్థితి సరిగ్గాలేని అనేక కుటుంబాలు ఉన్నాయి.

Update: 2023-01-28 07:44 GMT

ఉచిత విద్య నుంచి ఉపాధి వరకు.. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మొత్తం సమాచారం..!

MyScheme.gov.in: దేశంలో ఆర్థిక స్థితి సరిగ్గాలేని అనేక కుటుంబాలు ఉన్నాయి. కారణం విద్య, సరైన ఉపాధి లేకపోవడమే. ఒకవేళ కష్టపడి చదువుకున్నా తర్వాత ఉపాధి దొరకడం కష్టమవుతుంది. దీంతో కుటుంబం నడపడం చాలా భారంగా ఉంటుంది. అందుకే విద్య, ఉపాధి సమాచారం కోసం ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. ఇందులో అన్ని ప్రభుత్వ పథకాల సమాచారం ఉంటుంది. ఈ వెబ్‌సైట్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఈ వెబ్‌సైట్ పేరు MyScheme.gov.in. మీరు ఈ వెబ్‌సైట్‌ని సందర్శించి అన్ని రకాల స్కీమ్‌లను చూడవచ్చు. ముఖ్యంగా ఈ వెబ్‌సైట్‌లో వ్యవసాయం-గ్రామీణ, పర్యావరణం, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా వ్యాపారం, ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌, విద్య, శిక్షణ, ఆరోగ్యం , స్కిల్స్‌, ఉపాధితో సహా హౌసింగ్, షెల్టర్ వంటి 14 సేవల గురించి తెలుసుకోవచ్చు. సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ వెబ్‌సైట్ సేవను పొందడానికి ముందుగా ఫైండ్ స్కీమ్ ఎంపికకు వెళ్లాలి. ఆ తర్వాత మీ లింగాన్ని ఎంచుకోవాలి. తర్వాత వయస్సును నమోదు చేయాలి. మీరు గ్రామంలో లేదా నగరంలో నివసిస్తున్నారా తెలియజేయాలి. తర్వాత కులం గురించి సమాచారం అందించాలి. తర్వాత విద్యార్థి కాదా చెప్పాలి. ఇప్పుడు మీ ఆర్థిక స్థితి గురించి సమాచారం అడుగుతారు. మీరు ఈ సమాచారాన్ని నమోదు చేసిన వెంటనే మీ ముందు పథకాలు ఓపెన్‌ అవుతాయి. వీటిలో మీకు సరిపోయే దానిని ఎంచుకొని సద్వినియోగం చేసుకోవచ్చు. అవసరమైన సమాచారం పొందవచ్చు.

Tags:    

Similar News