సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పీ మరి బీజేపీ విమర్శలు చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ - జనసేన ను అడ్డంపెట్టుకొని టీడీపీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలే ఆసక్తికరంగా మారాయి.
కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన జగన్ ..టీడీపీ తనకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా సాధించేందు దిశగా ప్రయత్నిస్తున్న తమకు చంద్రబాబు మద్దతు పలకాలని సూచించారు. దీంతో డైలమాలో పడ్డ చంద్రబాబు వైసీపీ కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కానీ జనసేన పార్టీ ఆవిర్భావసభలో పవన్ కల్యాణ్ టీడీపీ టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాత్రికి రాత్రే పార్టీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఎన్డీఏపై తానే స్వయంగా అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతో ఏపీ బీజేపీ నేతలతో కేంద్రం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఏపీ బీజేపీ నేతలు - కేంద్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నట్లు తెలుస్తోంది.
వీరితో పాటు జగన్ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ భేటీతో బీజేపీ - వైసీపీ ఒక్కటయ్యే దిశగా ఉంటున్నాయని టీడీపీ అనుమానించింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది. బీజేపీ మీటింగ్ లో ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వార్తల్ని అస్త్రంగా చేసుకున్న టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది.
ఇదిలా ఉంటే భేటీలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారా అని నేషనల్ మీడియా ఏపీ బీజేపీ నేతల్ని ప్రశ్నించగా.. ఆయన వచ్చారని, కానీ ఆయన తమతో కలిసి భేటీలో కూర్చోలేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వారు సెటైరిక్‌గా చెప్పారా లేక నిజంగానే చెప్పారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
59ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఆఫీస్ మరోలా స్పందించింది. ప్రశాంత్ కిషోర్ కు ఢిల్లీలో ఆఫీస్ లేదని పేర్కొంది. దీంతో ఏది నిజమనే చర్చ సాగుతోంది. టీడీపీ చెప్పినట్లు ఆ భేటీలో పాల్గొన్నారా, లేక ఢిల్లీలోనే లేరా, బీజేపీ నేతలు వ్యంగ్యంగా చెప్పారా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ నేతలు మాత్రం ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతలతో కలిసి భేటీ అయ్యారని చెబుతూ టార్గెట్ చేస్తున్నారు.