ఛత్తీస్‌గడ్ నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి

Update: 2018-05-02 11:14 GMT

ఛత్తీస్‌గడ్ నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో కోస్తాంద్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా నిప్పుల కొలిమిలా మారుతున్నది. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 

Similar News