తెలంగాణ ఎన్నికల కోసం ఏపీసీఎం చంద్రబాబునాయుడు భారీగా డబ్బు సిద్ధం చేశారని ఆరోపించారు వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కోసం నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రూ.1,200 కోట్ల వరకూ తరలించారని ఆరోపించారు. అలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం రూ.500 కోట్ల చొప్పున పంపించారని.. ఈ విషయం చాలామంది నాయకులకు తెలుసన్నారు. ఈ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానని, ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తానని విజయసాయిరెడ్డి అన్నారు.