కొంతమంది అధికారుల తీరుపై గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహారశైలి బాగోలేదని ఆరోపిస్తూ ఆమరణదీక్షకు దిగారు. ఈ సందర్బంగా.. టీఆర్‌ఎస్ నేతల అండతో అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులు తనను వెంబడిస్తున్నారని అన్నారు. అంతేకాదు కొంతమంది అధికారుల అండతో టీఆర్‌ఎస్ డబ్బు, మద్యం పంచుతోందని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో గజ్వేల్‌లో ముఖ్యమంత్రి హోదాలో తెరాస అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగుతుండగా మహాకూటమి అభ్యర్థిగా వంటేరు పోటీకి సాయి అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కేసీఆర్ చేతిలో 19,029 ఓట్ల తేడాతో ఓడిపోయారు.