గుంటూరు జిల్లా బాపట్లలో సమాధిలో ధ్యానం...

Update: 2018-12-24 11:00 GMT

మీకు జీవితంలో మానసిక ప్రశాంతత లేదా ? ధ్యానం చేసిన చేసిన పరిస్థితిలో మార్పు రాలేదా ? ఎప్పుడైనా భూగర్భ సమాధి ధ్యానం చేశారా ? గంటలపాటు గోయిలో కూర్చున్నారా ? సమాధి ధ్యానంతో ప్రశాంతత తథ్యం అంటున్నారు కొందరు భక్తులు. 

గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలోని పొన్నూరులో బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాధ స్వామి ఆశ్రమ సేవా సమితి ఉంది. మాత శ్రీ లక్ష్మ కాంతమ్మ ఆధ్వర్యంలో బాపట్ల టౌన్ హాల్ లో 23వ నవకోటి జపపూర్ణహుతి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. యజ్ఞం తర్వాత భక్తులు భజనలు చేశారు. భక్తి పాటలతో హోరెత్తించారు. ఇద్దరు అర్చకులు భక్తిపారవశ్యంలో మునిగిపోయి నృత్యాలు చేస్తూ భజన చేశారు. 

ఈ భజన కార్యక్రమం తర్వాత భూగర్భంలో భూగర్భ సమాధి ధ్యానం కార్యక్రమం ప్రారంభమైంది. 6 అడుగుల లోతున 20 గుంతలు తవ్వారు. ఒక్కో గోయిలో ఒక్కో భక్తుడు తమ ఇష్ట దైవం తలుచుకుని కూర్చున్నారు. సమాధులపై ఇనుప రేకులు కప్పి వస్త్ర్రం కప్పారు. ఆ తర్వాత సమాధులపై మట్టి కప్పారు. సమాధి ధ్యానం రెండు గంటలు పాటు చేసిన తర్వాత భక్తులను గోతుల నుంచి వెలుపలికి తీశారు. సమాధి ధ్యానంతో ఆత్మ సాక్షాత్కరించిందని కొందరు భక్తులు అంటే, ఇష్ట దైవం కనిపించారని మరికొందరు భక్తులు చెబుతున్నారు. ఈ సమాధి ధ్యానం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

Similar News