చేసినన్ని రోజులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. చివరికి మానేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. ఉద్యోగం చేసినన్ని రోజులు.. గంటలకు గంటలు ట్రాఫిక్‌లో వెయిట్ చేసి.. చేసి.. ఆఫీస్‌కు వెళ్లేవాడు. చివరికి.. చిర్రెత్తుకొచ్చింది అతనికి. ఫైనల్‌గా ఉద్యోగం మానేయాలని డిసైడ్ అయ్యాడు. ఆఖరి రోజు మాత్రం.. ఆఫీస్‌కు గుర్రంపై వెళ్లి.. అందరూ అవాక్కయ్యేలా తన నిరసన తెలియజేశాడు. చూశారుగా.. ఇన్‌షర్ట్ చేసుకొని.. టై కట్టుకొని.. చక్కగా బ్యాగ్ తగిలించుకొని.. ఎంచక్కా గుర్రంపై ఆఫీసుకొచ్చేశాడు ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రోజూ ట్రాఫిక్‌లో గంటలకు గంటలు వెయిట్ చేసి.. చేసి.. చిర్రెత్తుకొచ్చింది. చివరికి ఇలా హార్స్‌పై వచ్చి కొలీగ్స్ అందరికీ షాకిచ్చాడు.
రాజస్థాన్‌కు చెందిన రూపేశ్ కుమార్ వర్మ.. ఉద్యోగరీత్యా.. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక.. టెక్‌హబ్ బెంగళూరు సంగతి తెలిసిందేగా. హైదరాబాద్‌తో పోలిస్తే తక్కువే ఐనా.. బెంగళూరులోనూ.. ట్రాఫిక్ కాస్త గట్టిగానే ఉంటుంది. రోజూ.. ఉదయాన్నే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు తెరిచే సమయానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. రోజూ రూపేశ్ ఆఫీసుకెళ్లే సమయానికి గంటలు, గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యేది. అలా.. ట్రాఫిక్ విషయంలో రూపేశ్‌కు చిర్రెత్తుకొచ్చింది. చివరిగా కంపెనీలో ఉద్యోగం మానేసే రోజు.. గుర్రంపై ఆఫీస్‌కు వచ్చేశాడు.
బెంగళూరులో ట్రాఫిక్ రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోందని.. దీనిపై నిరసన తెలియజేసేందుకే తాను గుర్రంపై వచ్చినట్లు రూపేశ్ వివరణ ఇచ్చారు. అంతేకాదు.. గుర్రానికి ఓ పక్కన ఈరోజే ఆఫీసుకు చివరిరోజు అని రాసి ఉన్న బోర్డును తగిలించారు. ఇకపై తాను ఏ కంపెనీలో ఉద్యోగం చేయబోనని, త్వరలోనే సొంతంగా ఓ సంస్థను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.