టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా

Update: 2018-12-14 11:13 GMT

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి ఈరన్న రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో ఈరన్న తన రాజీనామా లేఖను అందజేశారు. ఈరన్న ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. ఎన్నికల అఫిడవిట్లో ఈరన్న వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని ధర్మాసనం నిర్ధారించింది. 2014లో ఈరన్న టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

Similar News