చెన్నైలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా స్టాలిన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కాగల సత్తా, సామర్థ్యం రాహుల్ కు ఉందని.. దేశ తదుపరి ప్రధాని ఆయనే అవుతారని స్టాలిన్ అన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును తాను తమిళనాడు గడ్డ నుంచి ప్రతిపాదిస్తున్నానని స్టాలిన్ ప్రకటించారు. ఈ లక్ష్య సాధన కోసం తాము 2019 ఎన్నికల్లో రాహుల్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఐక్య కూటమిగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. కాగా స్టాలిన్ ఈ మాట చెబుతున్నప్పుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పక్కనే ఉన్నారు.