మాజీ ప్రజాప్రతినిధి దీనగాథ...బిక్ష మెత్తుకుంటున్న మాజీ ఎంపీటీసీ నాగులప్ప

Update: 2018-12-20 10:49 GMT

ఒకప్పుడు అతడు ఎంపీటీసీ. ఇప్పుడు బిక్షపతి. మంచి వ్యక్తి కావడంతో ఓ పార్టీ వారు అతడ్ని ఊసిగొల్పి ఎన్నికల్లో నిలబెట్టించారు. తనవద్దనున్న డబ్బులతో పాటు అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశాడు. పదవీకాలం ముగిశాక అప్పులు తీర్చలేక బిక్షాటన చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధి దీనగాథ ఇది. ఈ వృద్ధుడు పేరు నాగులప్ప. మాజీ ఎంపీటీసీ అయిన ఇతడు పదవీకాలం ముగిశాక పేదరికంతో బిక్షాటన చేస్తున్నాడు. 

అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామవాసి నాగులప్ప. మంచివ్యక్తిగా పేరున్న నాగులప్పను కొంత మంది టీడీపీ నాయకులు ఊసిగొల్పి 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో  పోటీ చేయించారు. వైసీపీ బలంగా ఉన్నా నాగులప్ప గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో తనవద్దనున్న డబ్బులతో పాటు అప్పులు తెచ్చి మూడు లక్షల రూపాయలు ఖర్చుచేశాడు నాగులప్ప. 

ఎంపీటీసీ గా పదవీకాలం ముగిశాక నాగులప్ప ఎన్నికల్లో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. సొంత ఇంటికి నిర్మించుకున్న మరుగుదొడ్డి బిల్లు కూడా రాలేదు. తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డాడు. పేదరికంతో భార్యతో కలిసి లోచర్ల గ్రామ సమీపంలోని కంటెమ్మ ఆలయంలో బిక్షమెత్తుతూ జీవనం సాగిస్తున్నారు.  సీఎం చంద్రబాబు సాయం చేయాలని వేడుకుంటున్నారు. మాజీ ప్రజాప్రతినిధి దీనస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి ఏ పార్టీ నాయకుడికి రావొద్దని చెబుతున్నారు. 

Similar News