మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం టికెట్‌ను టీడీపీకీ కేటాయించారు. అయితే టీడీపీ అభ్యర్ధి సామరంగారెడ్డికి అక్కడి నుంచి పోటీ చేయడం మొదటినుంచి ఇష్టం లేదు. ఆయన తనకు పట్టున్న ఎల్‌బీనగర్ టికెట్ ఆశించారు. అయితే ఎల్‌బీనగర్‌ను కాంగ్రెస్ నేత సుధీర్‌రెడ్డికి కేటాయించారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఇబ్రహీం పట్నంలో నామినేషన్ వేశారు సామారంగారెడ్డి. అయితే తనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరుపున నామినేషన్ వేయడంతో విజయవకాశాలపై అనుమానాలు మొదలయ్యాయి. అందుకే ఎల్‌బీ నగర్ నుంచి స్వతంత్రుడిగా నామినేషన్ వేశారు. దీంతో టీడీపీ ఇబ్రహీంపట్నం నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్‌కు అనధికారికంగా తెలియజేసింది. మల్‌రెడ్డి రంగారెడ్డి, మల్‌రెడ్డి రామిరెడ్డి లిద్దరు ఇబ్రాహీంపట్నంలో నామినేషన్ వేశారు. కానీ నియోజకవర్గంలో ఇద్దరి నేతల్లో ఒకరికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బుధవారం అర్ధరాత్రి జరిపిన చర్చల్లో మల్‌రెడ్డి రామిరెడ్డి పోటీ భరినుంచి తప్పుకోవడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో మల్‌రెడ్డి రంగారెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డి తప్పుకోవడంతో టీడీపీ 12 సీట్లకు పరిమితమయింది.