ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పవన్ కల్యాణ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్ ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. 40మంది ఎమ్మెల్యేల అవినీతి తన దృష్టికి వచ్చిందన్నారు. స్వయంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతిని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అయితే తాను చంద్రబాబుకి చెప్పినా పట్టించుకోలేదని, అందుకే నోరు విప్పాల్సి వచ్చిందన్నారు.
పోలవరంలోనూ భారీగా అవినీతి జరుగుతోందని పవన్ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. పోలవరంలో అసలేం జరుగుతుందో కేంద్రం పర్యవేక్షించాలన్నారు. కేసీఆర్‌తో పోలిస్తే చంద్రబాబు పాలన దారుణంగా ఉందన్న పవన్ కేసీఆర్‌కి 6 మార్కులిస్తే బాబుకి రెండున్నర మార్కులే ఇస్తానన్నారు.