గతనెల 25 ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి అందరికి తెలిసిందే. దాంతో ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి జరిగినప్పుడు కత్తి గాయం కారణంగా చిరిగిన ఆయన చొక్కాకు రక్తం మరకలు అయ్యాయి. దీంతో జగన్ ఆ చొక్కాను వీఐపీ లాంజ్‌లోనే మార్చుకుని మరో షర్టు ధరించి విమానంలో హైదరాబాద్ వెళ్లి చికిత్స కోసం నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా జగన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఘటన సమయంలో వైఎస్ జగన్ ధరించిన షర్టును ఈ నెల 23న కోర్టుకు సమర్పించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.