సాధారణ ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు తెరాస అధినేత కేసీఆర్. ప్రస్తుతం వ్యూహాలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచార పర్వానికి తెరతీశాయి. త్వరలో గులాబీ దళం కూడా ప్రచారానికి సిద్ధమవుతోంది. 50 రోజుల్లో 100 సభల నిర్వహణకు ముందుగా... ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 25 తర్వాత 3, 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పన బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యేలా చూడాలని భావిస్తున్నారు. తాజాగా కత్బుల్లాపూర్ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే వివేకానంద్ కు యంయల్ఎ సీటును కెసిఆర్ ప్రకటించారు. అలాగే మిగిలిన నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని తెరాస అధిష్టానం చెబుతోంది.