ఇటీవల అధిష్టానం పెద్దలపై కామెంట్లు చేసిన మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అయన మాత్రం వాటిపై నోరు మెదపలేదు కదా.. తన మాటల్లో ఎటువంటి పొరపాటు లేదని సమర్ధించుకున్నారు. ఇక ఈ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘ సమావేశంలో చర్చించారు. రాజగోపాల్‌రెడ్డికి రెండోసారి నోటీసులు ఇచ్చి 48 గంటలు గడిచినా ఆయన నుంచి సమాధానం రాలేదు. అయితే సమీప బంధువులు మరణించడంతోనే ఆయన సకాలంలో స్పందించలేకపోయారని కుటుంబ సభ్యులు.. ఫోన్‌లో సమాచారం ఇచ్చిన నేపథ్యంలో.. మరికొంత కాలం వేచి చూడాలని కమిటీ భావించింది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి నుంచి సరైన సమాధానం రాకపోతే ఆయనపై చర్యలు తీసుకునే విధంగా అధిష్టానానికి కమిటీ సిపారసు చేసే అవకాశమున్నట్టు చర్చ జరుగుతోంది.