ఢిల్లీకి కోదండరాం.. పోటీ అక్కడేనా?

Update: 2018-11-09 04:04 GMT

మహాకూటమిలో ఆశించినన్ని సీట్లు ఇవ్వకపోవడంతో కోదండరాం నేతృత్వంలోని టీజెఎస్ పార్టీ అసంతృప్తిగా ఉంది. దాంతో అయన మరోసారి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. తమకు 12 సీట్లు కావాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు జాబితా సమర్పించామన్నారు.. కుదరని పక్షంలో కాంగ్రెస్‌ ప్రకటించిన 8 సీట్లలో కోరిన స్థానాలే ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇదిఅలావుంటే ఈ ఎన్నికల్లో కోదండరాం జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని అనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు.. సీపీఐ కూడా కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తిగానే ఉంది. కేవలం మూడు స్థానాలను మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించించడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రాధాన్యం కల్గిన ఐదు స్థానాలైనా తమకు కేటాయించాలని కోరినా కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారు. సిపిఐ అడుగుతున్న హుస్నాబాద్‌, బెల్లంపల్లి, వైరా స్థానాలను కేటాయించినట్లు ప్రచారం జరుగుతుండగా అదనంగా కొత్తగూడెం స్థానాన్ని కూడా ఇవ్వాలని సిపిఐ నేతలు కోరుతున్నారు.

Similar News