కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా గూలాబీ బాస్ కేసీఆర్ దేశవ్యాప్త టూర్ మొదలైంది. విశాఖలో సీఎం కేసీఆర్ పర్యటన ముగిసింది. ఉదయం 11గంటల సమయంలో విశాఖ చేరుకున్న ఆయన నేరుగా శారదా పీఠానికి చేరుకున్నారు. స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడే ఉన్న రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలయంలోనే గడిపిన ఆయన విశాఖ ఎయిర్ పోర్టు చేరుకుని ఒడిసా బయలుదేరారు. భువనేశ్వర్ చేరుకున్న అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటి కానున్నారు .