పవన్ - కత్తి మహేష్ వివాదాన్ని పుల్ స్టాప్ పెట్టేందుకు రైటర్ కోన వెంకట్ ప్రయత్నించాడు. కత్తి ప్రెస్ మీట్ అనంతరం ఈనెల 15వరకు వెయిట్ చేయండి. కత్తిమహేష్ గురించి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కానీ, జనసేన అభిమానులు కానీ కామెంట్ చేయోద్దని సూచించాడు. ఇక కత్తిమహేష్ లైవ్ డిబెట్లలో పవన్ గురించి మాట్లాడొద్దని ..అలా చేస్తే వివాదానికి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తానని చిన్న హింట్ ఇచ్చాడు. కోన హింట్ సరే కత్తి మహేష్ సంగతేంటీ. కోన 15వరకు వెయిట్ చేయండి అంటే కత్తి మహేష్ మాత్రం 16దాకా ఆగండి అంటూ కౌంటర్ ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తిమహేష్ మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఓయూ జేఏసీ నేతలతో భేటీ అయ్యాడు. పవన్ కల్యాణ్ విషయంలో తన పై జరుగుతున్న దాడిని వివరించాడు. దీంతో జేఏసీ నేతలు కత్తిమహేష్ పై దాడి చేస్తే పవన్ కల్యాణ్ ను తెలంగాణ లో తిరగనివ్వం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ తో వివాదం మరింత ముదిరింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓ వైపు కత్తిహేష్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీనుంచి నిర్మాతలు, డైరక్టర్లు కత్తి తీరును ఎండగడుతూ లైవ్ డిబెట్లలో మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే కత్తిహేష్ పై మూత్రం పోస్తున్నట్లు ఉన్న ఓ ఫోటో వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ థియేటర్లో యూరిన్ సింక్ కు కత్తి మహేష్ ఫోటో అంటించి తీసిన వీడియో ఫేసుబుక్ లో వైరల్ అయింది. ఇలా యూరిన్ సింక్ కు తన ఫోటో అంటించిన విషయం కత్తి దృష్టికి వచ్చింది. ట్విట్టర్ లో సంబంధిత ఫొటోను జోడించి "ఇలాంటి వాటినే పవన్ ఫ్యాన్స్ చేస్తున్నారు. ఒకవేళ నా మౌనాన్ని నా బలహీనంగా తీసుకుంటే, వారి మూర్ఖత్వం ఖచ్చితముగా వారి ఆనందం అవదు " అని పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి స్పందించారు. మరి వీరి వివాదానికి ఫుల్ స్టాప్ పడేది ఎన్నడో.