రాజ్యసభ మాజీ ఎంపీ జయప్రద రజనీకాంత్, కమల్ హాసన్ కు హెచ్చరికలు జారీ చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ లు రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై స్పందించిన జయప్రద పాలిటిక్స్ అంటే రెండున్నగంటల సినిమా కాదని, ఇందులో రాణించడం చాలా కష్టమని అన్నారు. రాజకీయాలు పూల దారి కాదని ముళ్లదారని అందులో ఎత్తు పల్లాలు, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయని వాటిని తట్టుకొని రాణించాలని హితువుపలికారు. అంతేకాదు కమల్ హాసన్, రజనీ కాంత్ ల రాజకీయాన్ని ప్రవేశాన్ని ఆహ్వానించిన ఆమె కానీ వీరిలో ఎవరు రాణిస్తారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే రజనీ కాంత్ , కమల్ హాసన్ మంచి స్నేహితులు. ఆ స్నేహ బంధాన్ని పాలిటిక్స్ లో కూడా కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. అయితే సొంతపార్టీ పెట్టే ఆలోచనలేదని అనుమానం వ్యక్తం చేశారు.
రజనీ కాంత్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఇద్దరు ఒకే సారి వేదికను పంచుకుంటున్నారు. దీనికి ఊతమిచ్చేలా రజనీకాంత్ , కమల్ హాసన్ లో ఒకే పార్టీలో ఉంటారని తమిళఛానల్స్ లో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కమల్ హాసన్ , రజనీ కాంత్ పార్టీలో వచ్చి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.