అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : జనసేన

Update: 2018-11-20 03:07 GMT

 అన్ని పార్టీలు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. మందీ మార్బలంతో పోటీలోకి దిగేందుకు  రెడీ అయ్యాయి. అయితే జనసేన మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంటోంది. ఈ మేరకు ఎన్నికల్లో బరిలో నిలవడంలేదని జనసేన పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణలో నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్లయితే జనసేన పార్టీ తరుపున ఎక్కడెక్కడ పోటీ చేయాలో ప్రణాళిక రూపొందించుకున్నాం. అయితే.. ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఎన్నికల బరిలో నిలపడం కష్టంగా భావించాం. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం. ఎన్నికలపై పార్టీ నాయకుల సమావేశం జరిగింది. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్‌ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే సమాయత్తమవుతుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను' అని జనసేన అధ్యక్షడు పవన్‌ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుంటే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొద్దిరోజుల కింద విజయవాడలో వెల్లడించారు. కాగా ఏపీలో బలమైన ప్రతిపక్షం వైసీపీ సైతం అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. 

Similar News