వచ్చే ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన రజనీ కాంత్ ఏమేరకు రాణిస్తారు. తమిళనాడు సీఎం అవుతారా. అయితే ఎన్నిసీట్లు గెలుచుకుంటారు. పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా లేదా సొంతంగా పోటీ చేయాలా. రజనీ పోటీ చేస్తే ఏ పార్టీ ఓట్లు చీలుతాయి. ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుంది
ఇండియా టుడే - కార్వే సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి పొలిటిక్స్ ఎలా ఉన్నాయో. తమిళనాడులో రజనీకాంత్ పాలిటిక్స్ కూడా అలాగే ఉంటాయనే విషయం తేలింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేరని - ఆయన సీఎం కాలేరని ఈ సర్వే తేల్చింది.
ఎప్పటి నుంచో డీఎంకే - అన్నాడీఎంకే ల మధ్య పోటాపోటీ వాతావరణం కొనసాగుతుంది. అయితే జయలలిత మరణంతో బలపడేందుకు ప్రయత్నాలు జరిపిన బీజేపీ చేతులు కాల్చుకుంది. మరి ఇప్పుడు రజనీకాంత్ -కమల్ హాసన్ లు వస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై
రజనీ రాక వల్ల అన్నాడీఎంకేకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఈ పోల్ సర్వే చెబుతోంది.
డీఎంకే నుంచి అన్నాడీఎంకే నుంచి రజనీ కాంత్ కు ఎన్ని ఓట్లు పడతాయని ప్రశ్నిస్తే డీఎంకే 20శాతం, అన్నాడీఎంకే 16శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేలింది. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని 54 శాతం మంది అభిప్రాయపడగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రజనీకాంత్ పార్టీ 33 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఇండియాటుడే- కార్వీ సంయుక్త సర్వే చెబుతోంది.