ముస్లీం సోదరులు పవిత్రంగా భావించే హజ్ యాత్రికులకు కేంద్రం సబ్సీడీ ఎత్తివేసింది. సౌదీ అరేబియాలోని మక్కా క్షేత్రంలో అల్లా, అయన దూతలతో నిర్మిచుకున్న మస్జీద్ ను బక్రీద్ పండగకు ముందు దర్శించుకోవడమే ఈ హజ్ యాత్రా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ యాత్ర చేసేందుకు ముస్లీంలు ప్రపంచ నలుమూలలనుండి వస్తుంటారు. మదీనా నుండి మక్కా వరకు సాగె ఈ హజ్ యాత్ర ని ముస్లిం గా పుట్టినందుకు ఒక్కసారైనా తప్పక చెయ్యాలి. హజ్ యాత్ర అంటే ఏంటి? ఎందుకింత ప్రాముఖ్యం ? అంటే హజ్ అంటే సంకల్పం తనలో వున్నా చెడుని వీడి మంచి జీవితాంతం కొనసాగిస్తానని హాజీలు సంకల్పించుకుంటారు. హాజీలంటే మరెవరు కాదు హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన వారిని హాజీ అంటారు. ఇస్లాం మతం ముఖ్యంగా 5 క్రియ లపైనా నడుస్తోంది. విశ్వాసం, ప్రార్ధనా, ఉపవాసం, దాన ధర్మాలు ,హజ్ యాత్ర. ప్రతీ ముస్లిం వీటిని ఖచ్చింతంగా పాటించాలని ఇస్లాం మతం నిర్దేశిస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కా క్షేత్రంలో అల్లా, అయన దూతలతో నిర్మిచుకున్న మస్జీద్ ను బక్రీద్ పండగకు ముందు దర్శించుకోవడమే ఈ హజ్ యాత్రా యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అయితే ఈ యాత్ర చేసే యాత్రికులకు సబ్సీడీ ఎత్తివేస్తున్నట్లు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హాజ్ వెళ్లే 1.25 లక్షల మంది భారతీయ ముస్లింలు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ ద్వారా హజ్ యాత్రకు వెళ్తారు. అయితే ఇప్పుడు హజ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్యను 1.75 లక్షలకు పెంచారు. కానీ మొదటిసారి వారంతా సబ్సడీ లేకుండానే తీర్థయాత్రకు వెళ్లనున్నారు. సబ్సిడీ ఎత్తివేయడం వల్ల సుమారు రూ.700 కోట్ల ఆదా చేయవచ్చు అని ప్రభుత్వం వెల్లడించింది. ఆ డబ్బును ఇప్పుడు మైనార్టీల విద్య కోసం వాడనున్నారు.