మహేష్ పై దాడిని నిరసిస్తూ ఓయూ జేఏసీ ఆందోళన చేపట్టింది. . "ఖబడ్దార్ పవన్ కల్యాణ్.. తెలంగాణలో నిన్ను తిరగనివ్వం. అభిమానులకు చెప్పుకోలేని మూగవాడివి. నీ అభిమానులతో కత్తి మహేశ్ పై దాడి చేయిస్తావా?" అంటూ వారు తీవ్రంగా మండిపడ్డారు.
ఓ ఛానల్ ఇంట్వ్యూలో పాల్గొన్న కత్తిమహేష్ తిరిగివస్తుండగా కొండాపూర్ ప్రాంతంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసింది పవన్ కల్యాణ్ ఫాన్సే అయి ఉంటారని అన్నారు. అంతేకాదు కొంతమంది పవన్ ఫ్యాన్స్ పేరిట తనను కొందరు వేధింపులకు పాల్పడుతున్నారని , వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
అంతేకాదు ఖమ్మం లో ఓ థియేటర్లలో తన ఫోటో యూరిన్ సింగ్ లో అతికించి ఉన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై మాట్లాడిన కత్తిమహేష్ ఇది అమానుష చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలాంటి వాటినే పవన్ ఫ్యాన్స్ చేస్తున్నారు. ఒకవేళ నా మౌనాన్ని నా బలహీనంగా తీసుకుంటే, వారి మూర్ఖత్వం ఖచ్చితముగా వారి ఆనందం అవదు " అని పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి స్పందించారు.