కాంగ్రెస్ నేత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమల రేవంత్‌రెడ్డికి ఈడీ మరియు ఐటి షాకిచ్చింది. అయన ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ జూబిలీహిల్స్ , కొడంగల్ లోని అయన ఇళ్లలోనూ సోదాలు సాగిస్తున్నారు అధికారులు. మొత్తం మూడు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. సోదాలు జరుగుతుండటంతో రేవంత్ కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. కాగా 2015 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎమ్మెల్యేల సమీకరణ విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సెన్‌కు ఐదుకోట్లకు కుదిర్చారని రేవంత్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారం అందుకున్నఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేవలం రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఐటి అధికారులు రేవంత్‌రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తన రాజకీయ భవిశ్యత్ నాశనం చేయాలన్న ఉదేశ్యంతోనే ఈ కేసులు వచ్చాయని అన్నారు. ఇదిలావుంటే నేడు(గురువారం) కొడంగల్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది.