ఒడిశా చేరిన సీఎం కేసీఆర్‌

Update: 2018-12-23 11:54 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఒడిశా చేరుకున్నారు. విశాఖ నుంచి కుటుంబ సమేతంగా రాజధాని భువనేశ్వర్ చేరుకున్న ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటి కానున్న కేసీఆర్  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ రోజు రాత్రి నవీన్ పట్నాయక్ క్యాంప్‌ కార్యాలయంలోనే బస చేయనున్నారు. రేపు కోణార్క్, పూరీ దేవాలయాలను కుటుంబ సమేతంగా సందర్మించనున్నారు. అనంతరం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పశ్చిమ బంగా రాజధాని కోల్‌కటా వెళ్లి  టీఎంసీ అధినేత మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు.  
 

Similar News