ముఖ్యమంత్రి కేసీఆర్.... కొంగర కలాన్ చేరుకున్నారు. హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్... మరికాసేపట్లో సభావేదికపైకి వెళ్లనున్నారు. అయితే అందరి దృష్టి కేసీఆర్ ప్రసంగంపైనే ఉంది. ఏం మాట్లాడతోరంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. గంటన్నరపాటు ప్రసంగించనున్న కేసీఆర్.... సంచలన నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రగతి నివేదన సభా వేదిక పైనుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది.