జగన్‌కు చంద్రబాబు విషెస్..

Update: 2018-12-21 11:17 GMT


ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్టర్ వేదికగా చంద్రబాబునాయుడు జగన్ కు విషెస్ చెప్పారు. వైయస్ జగన్ గారు మీరు సకాల ఆనందాలతో నిండు ఆరోగ్యంతో చల్లగా ఉండాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబుతో పాటు టీఆర్ఎస్ ఎంపీ కవిత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ జగన్‌ మో‍‍హన్ రెడ్డికి  పుట్టినరోజుశుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ తన పుట్టిన రోజును ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

Similar News