పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

Update: 2018-12-24 06:34 GMT

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు తొలి రేడియల్ గేటు ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఇవాళ ప్రారంభమైంది. స్పిల్‌వేలో 41వ గేటు అమరికకు చంద్రబాబు పూజలు చేశాక గేటు అమర్చే ప్రక్రియను ప్రాజెక్టు అధికారులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలుత 41వ గేటు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. మొత్తం గేట్ల తయారీ కోసం 530 కోట్ల వ్యయం కానుంది. రేడియల్ గేట్లను నిలబెట్టేందుకు ఉపయోగించే హైడ్రాలిక్‌ సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేస్తున్నారు. పోలవరం  ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. 
 

Similar News