దాచేపల్లి అత్యాచార బాధితురాలిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని ముఖ్యమంత్రి ఓదార్చారు. ఆమెకు ధైర్య వచనాలు చెప్పారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులతోనూ సీఎం మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.