తెలంగాణలో ఎన్నికల సందర్బంగా ఇప్పటికే 86 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయడానికి బీజేపీ సిద్ధమైంది. ఇంతకుముందే ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల పర్యటన షెడ్యూలు ఖరారు చేయగా. తాజగా నలభై మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మోదీ, అమిత్ షాలతోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రముఖ సినీనటి జీవితారాజశేఖర్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, కె. హరిబాబు, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులకు చోటు దక్కింది.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా..
1. నరేంద్ర మోదీ
2. అమిత్ షా
3. రాజ్‌నాథ్ సింగ్
4. అరుణ్ జైట్లీ
5. సుష్మా స్వరాజ్
6. నితిన్ గడ్కరీ
7. రామ్‌లాల్
8. యోగి అదిత్యానాథ్
9. రమణ్‌సింగ్
10. రవిశంకర్ ప్రసాద్
11. నిర్మల సీతారామన్
12. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
13. డీవీ సదానంద గౌడ
14. జగత్‌ప్రకాశ్ నడ్డా
15. స్మృతి ఇరానీ
16. పియూష్ గోయల్
17. థావర్‌చంద్ గెహ్లాట్
18. పురుషోత్తమ్ రూపాలా
19. సాధ్వి నిరంజన్ జ్యోతి
20. హన్స్‌రాజ్ గంగారామ్
21. జువల్ ఓరం
22. రాంమాధవ్
23. మురళీధర్ రావ్
24. హేమా మాలిని
25. బీఎల్ సంతోష్
26. పీకే కృష్ణదాస్
27. సాయికుమార్
28. కె లక్ష్మణ్
29. బండారు దత్తాత్రేయ
30. కిషన్ రెడ్డి
31. ఇంద్రసేన రెడ్డి
32. స్వామి పరిపూర్ణానంద
33. ప్రేమెందర్ రెడ్డి
34. చింతా సాంబమూర్తి
35. జీవిత రాజశేఖర్
36. కన్నా లక్ష్మీనారాయణ
37. దగ్గుబాటి పురందేశ్వరి
38. కే హరిబాబు
39. జీవీఎల్ నరసింహారావు
40. మంత్రి శ్రీనివాసులు