బోర్లా పడుకున్న భక్తులపై తొక్కుకుంటూ వెళ్లిన భూతప్పలు

Update: 2018-12-24 10:41 GMT

అనంతపురం జిల్లా మడకశిర మండలం భక్త రపల్లి గ్రామంలో  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు  ఆంధ్ర, కర్ణాటక ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ జాతరలో భాగంగా భూతప్పల ఉత్సవం అట్టహాసంగా నిర్వహించారు. భూతప్పల ఉత్సవంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న భక్తులు ఆలయంలోని కోనేరులో స్నానం చేసి తడి వస్త్రాలతో బోర్లా పడుకున్నారు. ఆలయ ప్రాంగణంలో బోర్లా పడుకున్న భక్తులపై విష్ణుమూర్తి ద్వారం కాపలాదారులుగా పిలువబడే భూతప్పలు తొక్కుకుంటూ వెళ్లారు. భూతప్పల కాలి స్పర్శ తగిలితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 

Similar News