ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి తీరు చూస్తే అనుమానం కలుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఎయిర్‌పోర్టు లోపల జరిగితే బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తి హైదరాబాద్ వెళ్లిపోయారని, ప్రతిపక్ష నాయకుడు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఘటనపై గవర్నర్ ఫోన్ చేసి డీజీపీని నివేదిక ఎలా అడుగుతారు ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా కేంద్ర సర్కార్ కుట్రలు పన్నుతోందని సీఎం ఆరోపించారు.